in , , ,

జగనన్న ఆరోగ్య సురక్షి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

విశాఖపట్నం అక్టోబర్ 03:- ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షిత కార్యక్రమాన్ని చేపట్టిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి విడుదల రజిని తెలిపార మంగళవారం ఆమె 3 వ జోన్ 16వ వార్డు పరిధిలోని ఇసుకతోట వద్ద వైయస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జగనన్న ఆరోగ్య సురక్షిత శిబిరాన్ని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పార్లమెంటు సభ్యులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎం వి వి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, జివిఎంసి కమిషనర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ వైద్య పథకం ప్రవేశపెట్టి సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వారి వ్యాధులను గుర్తించి వారికి తగిన వైద్యం అందిస్తుందని తెలిపారు. 45 రోజులు పాటు సాగే ఈ కార్యక్రమానికి ప్రతి పేదవాడు వైద్యం చేయించుకోవాలని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్షిత పథకం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు వైద్యం అందుతుందని ఆయన తెలిపారు.

 తదుపరి నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందుతుందని, జీవీఎంసీ పరిధిలో 72 జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాలను ఏర్పాటుచేసి ఖరీదైన వైద్యం ప్రతి పేదవారికి అందించడం జరుగుతుందని తెలిపారు. గత 20 రోజులుగా సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని వారి అందరిని ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులచే వైద్యం అందిస్తున్నారని తెలిపారు.  పార్లమెంటు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పేదవానికి ఇంటివద్దకే వైద్యం అందాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్షిత పథకం ప్రవేశపెట్టారని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరాలలో నిపుణులైన వైద్యులు సహకారంతో ఎంతో ఖరీదైన వైద్యం ఉచితంగా 7జగనన్న అందిస్తున్నారని కొనియాడారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల పరిధిలో గత 15 రోజులుగా ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ఆరోగ్య సురక్షిత కార్యక్రమం పై అవగాహన కల్పించాలని, దీనిలో ముఖ్యంగా బీపీ, షుగరు, కళ్ళు, దంతలు లాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు వైద్యం అందుతుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎం. అప్పారావు, జీవీఎంసీ సిబ్బంది సచివాలయ కార్యదర్శులు ప్రభుత్వ వైద్యులు ఇతర వైయస్సార్ పార్టీ  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన

మాత్స్యకారుల చిరకాల కల నెరవేరుతుంది వైసీపీ ఎమ్మెల్యే అవంతి