*పట్టణంలో రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలు:*
సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 1 వరకు 9వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు 14,16,18,20 సంవత్సరాల లోపు బాల బాలికలకు మరియు పురుషులకు, మహిళలకు జరగనున్నాయి.
ఈ పోటీలలో తెలంగాణలోని 33 జిల్లాల నుండి 1200 క్రీడాకారులు మరియు 66 మంది కోచ్ మేనేజర్లు 45 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారు.
ఈ పోటీలకు రాష్ట్రంలోనే మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయి పోటీలలో ఉపయోగించే ఫోటో ఫినిష్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ పోటీలను ఈనెల *30వ ఉదయం 8 గంటలకు ప్రారంభం* కానున్నాయి.
ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం అదే రోజు సాయంత్రం మూడు గంటలకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ మాత్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు మరియు కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు ప్రారంభించ నున్నారు.
అదేవిధంగా అక్టోబర్ ఒకటో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ బి గోపి IAS పాల్గొననున్నారు.
ఈ పోటీలు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు స్టాన్లీ జోన్స్, సారంగపాణి మరియు జిల్లా క్రీడల అభివృద్ధికి అధికారి రాజా వీరు పర్యవేక్షణలో జరగనున్నాయి.
ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులందరికి భోజన వసతి తో పాటు క్రీడాకారులు రెండు రోజులపాటు ఉండటానికి అన్ని వసతులను ఏర్పాటు చేసినట్టు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్ కడారి రవి తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!