in , ,

దొంగగా మారిన సాప్ట్ వేర్ ఉద్యోగి

ఉన్నత చదువులు చదివి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని కరోనా పరిస్థితులు దొంగగా మార్చాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.హైదరాబాద్‌లో డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన కందిబోయిన గంగ అమరేశ్వర్‌నాథ్‌(28) ఉన్నత చదువులు చదివాడు. అతడి తండ్రి ప్రైవేటు ఉపాధ్యాయుడు. చెల్లెలు అమెరికాలో ఉంటోంది.2016లో చదువు పూర్తిచేసుకున్న అమరేశ్వర్‌నాథ్‌కు బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్‌లోని మరో కంపెనీలో అవకాశం రావడంతో నానక్‌రాంగూడకు వచ్చేశారు. కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయి. పలువురిని మోసం చేసి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. 2020 ఆగస్టులో మాదాపూర్‌లో ఓ ఐస్‌క్రీం పార్లర్‌కు వెళ్లి తన దగ్గర రూ.100 నోట్లు ఉన్నాయని యజమాని నుంచి రూ.10వేలు తీసుకున్నాడు.తన వాహనం దగ్గరకు వస్తే వందనోట్లు ఇస్తానని యజమానిని బయటకు రమ్మని చెప్పి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఇలా మాదాపూర్‌లో పలుచోట్ల వరుసగా దొంగతనాలకు పాల్పడటంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిలుపై బయటకు వచ్చాక తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవటంతో చికిత్సకు డబ్బు అవసరమై మళ్లీ మోసాల బాటపట్టాడు. రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్‌ ఠాణాల పరిధిలో పలువురిని దగా చేసి రూ.2.10లక్షలు కాజేశాడు. ఆ డబ్బు తన ఖాతా నుంచి తండ్రి ఖాతాలోకి బదిలీ చేశాడు. అమరేశ్వర్‌నాథ్‌ మోసాలపై చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదులు అందడంతో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం అతనిపై ఏడు కేసులు నమోదైనట్లు తెలిపారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

రాజమండ్రి ఆస్పత్రి లో నకిలీ ధృవపత్రాలు!

ఆదోని మార్కెట్ యార్డులో వేరుశనగ కొనుగోలు వెంటనే ప్రారంభించాలి