in , ,

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో చోరీ

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిఘా కొరవడింది. గిరిజనానికి కీలకంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయం కావడంతో నిత్యం వివిధ ప్రాంత ప్రజలు ఈ కార్యాలయాన్ని సందర్శిస్తుంటారు.ఇక్కడ సుమారు 30 ప్రభుత్వ శాఖలున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయాల్లో చొరబడి విలువైన ప్రభుత్వ సామగ్రిని దొంగిలిస్తున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఓ పథకానికి సంబంధించి విలువైన సామగ్రి మాయమైంది. దీనిపై దృష్టి సారించిన అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించగా..విలువైన సామగ్రి అదృశ్యమవుతున్నట్లు గుర్తించారు. ఈనెల 1న ఓ ఆగంతకుడు వైద్యశాఖ, డీడీ కార్యాలయాల్లోకి ప్రవేశించి విద్యుత్తు లైట్లు, ఇతర సామగ్రి తీసుకుని కిటికీ ద్వారా బయటకు ఉడాయించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ విషయం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్‌ దృష్టికెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఇకపై అన్ని విభాగాల సీసీ కెమెరాలను తన కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. పీవో ఛాంబర్‌ వద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

మరింత మంచి సేవలు అందిస్తా:

యుద్ద ప్రాతిపదికన ట్రాక్ మరమ్మతులు