ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులలో చంద్రబాబును విచారణ జరిపేందుకు మరో 5 రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ రెండు పిటిషన్ల విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఒకేసారి ఈ రెండు పిటిషన్లపై రేపు వాదనలు వింటామని, ఒకేసారి ఆదేశాలు ఇస్తామని జడ్జి వెల్లడించారు.
