వాట్సాప్ ఇటీవల ‘వాట్సాప్ ఛానెల్స్’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇటీవల ప్రధాని మోదీ కూడా వాట్సాప్ ఛానెల్స్ ఖాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ పోస్ట్ పెడుతూ.. ‘వాట్సాప్ ఛానెల్’లో నాతో అనుసంధానమైనందుకు గొప్పగా భావిస్తున్నాను. వీరు అందిస్తున్నమద్దతుకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో దీని ద్వారా మరిన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం’ అని మోదీ తన ఛానెల్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఆయన్ను 50 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
