జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి క్షేత్రంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు సోమవారంతో 3 రోజుకు చేరుకున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామి వారికి పుణ్యా హవచనము, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ట, వాస్తు హోమం, సూత్ర గ్రహణం, ప్రోక్షణ, గ్రంధి బందనం, చతుర్వేదద్యయనం, ద్వాదశ సూక్త పారాయణం, ఏతత్ ప్రధాన హోమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!