స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నిరసనదీక్ష చేపట్టారు. టీడీపీ నేతలు సహా పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉండగా నేరుగా వారి వద్దకు వెళ్లేవాడిని. కానీ, కేసీఆర్ మాత్రం దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం’’ అంటూ బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.