ఇరుకై న రహదారుల కంటే ప్రధాన రోడ్లపైనే ఊరేగింపు చేపడితే మంచిది.
నిమజ్జనం సమయంలో..
కాలువలు, నదులు, చెరువుల్లో విగ్రహ నిమజ్జనాల సమయంలో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఈతరానివారు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. రాత్రి సమయాల్లో నిమజ్జనం చేస్తే అటువంటి సమయాల్లో ఎక్కువ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఊరేగింపుకు ఎంతమంది వచ్చారు. తిరుగు ప్రయాణంలో వచ్చిన వారు ఉన్నారా? లేదా? అన్నది సరిచూసుకోవాలి. నిమజ్జనానికి ముందు పోలీసులకు సమాచారం ఇస్తే అవాంఛనీయ సంఘటనలను నియంత్రించే వీలుంటుంది.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
నిమజ్జనాల్లో ప్రాణాపాయం కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉత్సవ కమిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఉత్సవ కమిటీలకు అవసరమైన సూచనలు ఇచ్చాం. నిమజ్జనాలు చేసే సమయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే అందుకు తగిన చర్యలు చేపట్టడానికి అవకాశముంటుంది. నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో చేపట్టేలా పోలీస్స్టేషన్లకు ఆదేశాలిచ్చాం. రెవెన్యూ, విద్యుత్, మత్స్యశాఖలను సమన్వయం చేస్తున్నాం అని
టీఎస్ఆర్కే ప్రసాద్, డీఎస్పీ, రామచంద్రపురం వివరించారు.
ఊరేగింపు సమయంలో..
● వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో కండిషన్లో ఉన్న వాహనాలను ఎంచుకోవాలి.
● ఉత్సాహంతో వాహనాలను ఎక్కుతూ, దిగుతూ ఉండే వారిని నియంత్రించాలి.
● మితిమీరిన విద్యుత్ అలంకరణలు శ్రేయస్కరం కాదు.
● నిమజ్జనానికి వెళ్లేదారిలో విద్యుత్ తీగలు తగలకుండా చూసుకోవాలి.
● అడ్డొస్తున్న విద్యుత్ తీగలను తప్పించేందుకు పొడవైన ఎండు కర్రలు ఉంచుకోవాలి.
● ఇతరులపై రంగులు చల్లడం, అసభ్యంగా ప్రవర్తిస్తే వివాదాలు తలెత్తుతాయి. అటువంటి వారితో కమిటీ అప్రమత్తంగా ఉండాలి.
● ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఊరేగింపు నిర్వహించాలి.
●
This post was created with our nice and easy submission form. Create your post!