తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లను టీటీడీ ఆదివారం విడుదల చేసింది. టికెట్లను టీటీటీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఆదివారం బ్రేక్, ప్రత్యేక దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. మంగళవారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు బయట క్యూలైన్‌లో వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శానికి 18 గంటల సమయం పడుతున్నది.
