in ,

సమగ్ర భూముల సర్వే చరిత్రాత్మకం

జగన్ చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే చరిత్రాత్మకం అని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. ఆదివారం నందిగామ మండలంలోని పల్లగిరిలో జగనన్న భూ హక్కు -భూ రక్ష కార్యక్రమం జరిగింది. శాశ్వత భూ హక్కు పత్రాలను ఎమ్మెల్యే రైతులకు పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఎవరూ రికార్డులను తారుమారు చేయకుండా భూమికి సంబంధించిన డిజిటల్ రికార్డులను తయారు చేస్తారని తెలిపారు. ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాల్లో శాశ్వత భూహక్కు పత్రాలను పంపిణీ చేయడం ప్రారంభించామని, జగనన్న సంపూర్ణ భూ హక్కు పత్రాల్లో క్యూర్‌ కోడ్, మ్యాపుల ఫొటోలు, విస్తీర్ణం, సర్వే నంబర్లతో సహా అన్ని వివరాలూ ముద్రించారని చెప్పారు. క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే రైతు తమ భూముల సమస్త వివరాలనూ తెలుసుకోవచ్చని, భూ యజమాని, రైతులకు సంబంధించిన అన్ని వివరాలూ ఇందులో ఉన్నాయని తెలిపారు. రైతులు, యజమానులు ఎటువంటి ఆందోళన, సందేహాలకు గురికానవసరం లేదని, అన్ని వివరాలతో ఉన్న హక్కు పత్రాలను పొందేలా అధికారులు ఈ హక్కు పత్రాలను సిద్ధం చేశారన్నారు. విడతల వారీగా రైతులకు ఈ పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Abdul

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

చంద్రబాబుకు మరో బిగ్ షాక్

తొమ్మిది వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోడీ