డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు కొనసాగుతున్నారు. సత్యానందరావు సొంత సోదరుడు శ్రీనివాస్ జనసేన పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు.
గత ఎన్నికల్లో వీరిద్దరూ జనసేన టిడిపి పార్టీల నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

వీరిద్దరి అనుచరులు రెండుగా విడిపోవడంతో స్వల్ప ఓట్లతో చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా జనసేనతో టిడిపి పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో కొత్తపేటలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి.. కుటుంబ కలహాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోఎమ్మెల్యేగా గెలవాలని చూస్తున్న బండారు శ్రీనివాస్ కు ఇబ్బందులుగా మారాయి. కొత్తపేటలో జరిగిన టిడిపి పార్టీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఇరువురు చేతులు కలపడంతో. జనసేన టిడిపి పార్టీలు ఎవరికి టికెట్ ఇచ్చినా తగ్గవలసిన పరిస్థితి వచ్చింది. టిడిపి పార్టీ అభ్యర్థిగా సత్యానందరావు పోటీ చేస్తే. నేను పార్టీ అధ్యక్షుడు ఆదేశాలమేరకు సపోర్ట్ చేస్తా అని జనసైనికుడు శ్రీనివాస్ చెపుతుంటే ఆయన అభిమానులు మాత్రం
పొత్తులో భాగంగా టిక్కెట్ రాకపోతే శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరులైన నిలుస్తారని ఏది ఏమైనా ఏదైనా జరగొచ్చు అని శ్రీనివాస్ అభిమానులు అనుకుంటున్నారని గుసగుసలు.శ్రీనివాస్ అభిమానులు గత కొన్ని రోజులుగా తర్జన భర్జన లో పడినట్లు తెలుస్తోంది.అభిమానులు ఇలా ఉంటే శ్రీనివాస్ మాత్రం ఈ సారి కొత్తపేట లో వైసీపీ జెండా ఎగరనివ్వం అని వైసీపీ అధినేత కు హెచ్చరికలు జారీ చేస్తూ పొత్తు కూడిన దగ్గర నుంచి ప్రతి మీటింగ్ లోని అదే చెప్పడం గమనార్హం.ఎది ఏమైనా ఈసారి కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నికలు మంచి రసవత్తరంగా మారనున్నాయి.
This post was created with our nice and easy submission form. Create your post!