గత కొంతకాలంగా నారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్ రెడ్డి శనివారం శ్వాస అందక గుండెపోటుతో కన్నుముశారు. 1994 నుండి 2009 వరకు పరిగి ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన వరుస విజయాలు సాధించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గం నుంచి పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన సీనియర్ రాజకీయ నేతగా, ప్రజలకు ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు.