ఆదోని న్యూస్ :- ఆదోని పట్టణంలోని స్థానిక మునిసిపల్ వాటర్ పంప్ హౌస్ నందు గత ఐదు రోజులుగా పూజలందుకున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కార్యనిర్వహణ ఫిట్టర్ రామాంజనేయులు సమక్షంలో మున్సిపల్ కమిషనర్ జీ. రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ రాధాకృష్ణ, డి ఈ నాగభూషణం రెడ్డి, ఏఈ రాజశేఖర్ రెడ్డి, ఏఈ కృపాకర్, మరియు మున్సిపల్ సిబ్బంది సమక్షం నందు లడ్డు వేలంపాట పోటా పోటీగా జరిగింది. గణేష్ నిమజ్జనం ప్రారంభానికి ముందు లడ్డు వేలంపాట నిర్వహించడం ఆనవాయుతుగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. లడ్డు వేలంపాట వేయగా అమరావతి వాటర్ ఫిట్టర్ ఈరన్న రూ.32,000 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గణపతి పూజ కలశం వేలం పాటు వేయగా రూ.2,200 లకు వాటర్ సెక్షన్ లైన్మెన్ గోపాల్ దక్కించుకున్నారు. గణనాథుడికి పూజలు చేసిన అనంతరం మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ రాధాకృష్ణ, డిఈ నాగభూషణం రెడ్డి, ఏఈ రాజశేఖర్ రెడ్డి, ఏఈ కృపాకర్ ఆధ్వర్యంలో పంప్ హౌస్ నుంచి వినాయకుడిని ఎల్ఎల్సీ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీనివాస్ భవన్ కూడలిలో పూజలు చేసిన అనంతరం చిన్న హరివాణం ఎల్ఎల్సికి నిమజ్జనానికి తరలించారు. ఎల్ఎల్సీ వినాయక ఘాటు గంగమ్మకు పూజలు చేసి లంబోదరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది ఘనంగా నిర్వహించుకున్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!