డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వ హిస్తున్న 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమానికి వచ్చిన ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్ జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులను ఆదే శించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యా లయంలో మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ ఎం. ముక్కంటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. మండలంలో వివిధ గ్రామాల నుంచి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందించిన వినతులను జేసీ స్వీకరించారు. వాటిలో బిళ్లకుర్రు పంచాయతీ పరిధిలో సుమారు 25 ఎక రాల్లో కొబ్బరి చెట్లు చనిపోయి తీవ్రంగా నష్టపో యిన రైతులను ఓఎన్జీసీ ద్వారా ఆదుకోవాలని ఎం పీపీ మార్గన గంగాధరరావు, సర్పంచ్ నెల్లి లక్ష్మీప తిరావు ఆధ్వర్యంలో బాధిత రైతులు అర్జీ సమర్పిం చారు. కొత్తపేట పరిసర ప్రాంతాల మురుగు దిగే ఏకై క కైశిక డ్రైన్‌ను అభివృద్ధి చేయాలని జెడ్పీటీసీ సభ్యురాలు గూడపాటి రమాదేవి ఆధ్వర్యంలో స్థానికులు అర్జీ ఇచ్చారు. ఇలా రెవెన్యూకు సంబం ధించి 13, మండల పరిషత్‌కు 8, విద్యుత్, హౌసింగ్ శాఖలకు 4 చొప్పున, డీఆర్డీఏకు 3, డ్రైన్స్, ఆర్డ బ్ల్యూఎస్ సచివాలయాలకు రెండు చొప్పున, మరో 5 శాఖలకు 5తో మొత్తం 43 అర్జీలు వచ్చాయి. ప్రతి అర్జీదారుని నుంచి సంబంధిత సమస్యలను జేసీ సవివరంగా విన్నారు. వెంటనే సంబంధిత అధికారు లను పిలిచి ఆ సమస్య దీర్ఘకాలికమైందా? అయితే ఇంతకాలం పరిష్కారం కాకపోవడానికి గల కారణా లపై ఆరా తీశారు. వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. తాజా సమస్య అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భం గా జేసీ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్ర మంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీ దారులకు నాణ్యమైన పరిష్కార మార్గాలు సంతృప్తి కర స్థాయిలో చూపాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యూఎస్, పీఆర్ ఎస్ఈలు ఎన్వీ కృష్ణారెడ్డి, కె.చంటిబాబు, డీఎల్డీఓ ఎం.ప్రభాకర్, తహసీల్దార్ జీడీ కిశోర్ బాబు, ఎంపీడీఓ ఇ.మహేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ వి. శివశంకరప్రసాద్, డ్వామా పీడీ ఎస్. మధుసూద న్, సివిల్ సప్లయిస్ డీఎం ఎస్.సుధాసాగర్ తదిత రులు పాల్గొన్నారు.
[zombify_post]