జిల్లా రైస్ మిల్లర్ల సంఘ నూతన అధ్యక్షుడిగా ఆర్.వి.ఎస్ వెంకటేశ్వరరావు(వాసు) వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం ఒప్పంగి సమీపంలోని రైస్ మిల్లర్ల భవన్లో లో మంగళవారం అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. గత కార్యవర్గాన్ని అసోసియేషన్ శాశ్వత గౌరవాధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, కింజరాపు ప్రసాద్ పర్యవేక్షణలో సభ్యులు మరోసారి ఎన్నుకున్నారు. అసోసియేషన్ కార్యదర్శిగా కె. వి. గోపాల్, కోశాధికారిగా తాళాసు
కృష్ణారావు, ఉప కోశాధికారిగా పి. రాములు, ఉపాధ్యక్షులుగా ఎం. సూర్యనారాయణ, ఎ. ధనంజయ్, ఎస్. కుమారస్వామి, కె. రాంబాబు, టి. అర్జునబాబు, | సహాయ కార్యదర్శులుగా కె.శంకరరావు, పి.విజయకుమార్ను ఎన్నుకున్నారు. కార్యకమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ జి. కృష్ణమూర్తి, బి. లక్ష్మణరావు, టి.నాగేశ్వరరావు, జోగిశెట్టి, పాల్గొన్నారు.
[zombify_post]