. జి.సిగడాం మండలం ఎందువ – బాతువ గ్రామాల మధ్య సోమవారం రైల్వే లైన్ ఓహెచ్ తీగలు తెగిపడడంతో ఈఎంయూ రైలు నిలిచిపోయింది. పలాస నుంచి విశాఖ వెళ్తున్న ఈ రైలు మధ్యాహ్నం 3.15 గంటల పైనే నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది వేగంగా స్పందించలేదు. మరమ్మతులు చేపట్టడానికి మూడు గంటలు పట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు 6.15 గంటలు దాటిన తర్వాత కదిలింది. అదే సమయంలో దిబ్రుగఢ్- కన్యాకుమారి సూపర్ఫాస్ట్ రైలును డౌన్లైన్లో చీపురుపల్లి వరకు పంపించి అక్కడ నుంచి అప్లైన్కు మళ్లించారు. అదే లైన్లో వచ్చిన పలు రైళ్లను అధికారులు ప్రత్యామ్నాయ మార్గంలో పంపించారు.
[zombify_post]