నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం వద్ద కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్ అనే వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి హైదారాబాద్ నుంచి చింతపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నసర్లపల్లి వద్దకు రాగానే వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో ప్రసాద్, అవినాష్ కారు డ్రైవర్ మణిపాల్ మృతి చెందారు.
మృతుల వివరాలు
మద్దిమడుగు ప్రసాద్ (38), మద్దిమడుగు అవినాశ్ (12), పట్నపు మణిపాల్ (18), మద్దిమడుగు రమణ (35), వనం మల్లికార్జున్ (12)