గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి రాము మాట్లాడుతూ తరగతి గదుల్లో విద్యుత్ సదుపాయం లేదని, మరుగుదొడ్డి దుర్వాసన తట్టుకోలేకపోతున్నారని, ఆట వస్తువుల పేరుతో విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
[zombify_post]