- ఆదోని నియోజకవర్గం లోని లో మండిగిరి గ్రామపంచాయతీలోని తిరుమల్ నగర్ లో అమరావతి ఇంటర్నేషనల్ స్కూల్లో గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని మాజీ టిడిపి ఇన్చార్జి శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పూజా కార్యక్రమం అనంతరం సోమవారం మాట్లాడుతూ…. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబుకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. జగన్ తప్పుడు కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపించారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని… కేంద్రం కూడా సర్టిఫై చేసిందన్నారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై పెట్టిన కేసు తప్పుడు కేసన్నారు. ఐటీ ఉద్యోగులు బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైలో చంద్రబాబు విడిచి పెట్టాలని ఆందోళన చేస్తున్నారన్నారు. కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఏపీలో చట్టం ధర్మం లేదని.. ఏపీ రాజకీయ అనుచిత ఏర్పడిందని అన్నారు. చట్టాన్ని ధర్మాన్ని పరిరక్షించాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ స్కూల్ కరస్పాండెంట్ జి రామకృష్ణ మాజీ ఎంపిటిసి రాజేశ్వరి అమరావతి స్కూల్ సిబ్బంది అధ్యర్యంలో మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
[zombify_post]