జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు మేకా శేషుబాబు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం శేషుబాబుకి ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు జవ్వాది శేషుబాబుకి శేషవస్త్రాన్ని కప్పి సత్కరించి, స్వామి వారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.
[zombify_post]