-
విజయభేరి సభకు చకచకా ఏర్పాట్లు.. మొత్తం ఎన్ని వేదికలంటే..?
-
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఈసీటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే విజయభేరి సభకు చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
- రంగారెడ్డిల్లా తుక్కుగూడ ఈసీటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే విజయభేరి సభకు చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ప్రధానంగా మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌తో పాటు ఇతర కీలక నేతలు, కుడివైపు ఏర్పాటు చేసిన వేదికపై ఇతర రాష్ర్టాల పీసీసీ, సీఎల్పీ నేతలు, ఎడమవైపు ఉన్న వేదిక పై రాష్ర్ట పీసీసీ కార్యవర్గం, సీఎల్పీ నేతలు, కళాకారుల కోసం వేదికను కేటాయించారు. ప్రాంగణంలో సుమారుగా 2000 మంది వేదికపై ఆసీనులయ్యే విధంగా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు.
విజయభేరి సభకు రాష్ర్టం నలుమూల నుంచి 10 లక్షల మంది వరకు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడ ఇబ్బందులు తల్లెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత వారం రోజుల నుంచి విజయభేరి సభ ఏర్పాట్లను రాష్ర్ట పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఏఐసీసీ నేతలు వేణుగోపాల్చారి, రాష్ర్ట ఇన్చార్జీ థాక్రేల సలహా, సూచనలతో విజయభేరి సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశం నలుమూల నుంచి కాంగ్రెస్ జాతీయ, రాష్ర్ట నేతలు తరలిరావడంతో సభపై అందరి దృష్టి పడింది.
[zombify_post]