అందినకాడికి దోచేయ్.. అదును చూచి మెడికల్ షాపులు, ఆర్ఎంపిల, అడ్డగోలు దోపిడీ...:గత వారం రోజులుగా, ని
ర్మల్ జిల్లా, ఖానాపూర్ నియోజకవర్గం లోని, ఖానా
పూర్, పెంబి, కడం, దస్తురాబాద్, మండలాల్లో విష
జ్వరాలు, వైరల్, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు
విజృంభిస్తున్నాయి. ఈ తరుణంలో, రోగులు భయంతో
స్థానికంగా ఉండే, ఆర్ఎంపీ వైద్యులు, స్థానిక మెడికల్
షాపులు, ఓవర్ ద కౌంటర్, మందులను ఆశ్రయిస్తు
న్నారు. రోగులకు, దీంతో సరైన వైద్య మందకపోగా
,రోజుల తరబడి వీరి దోపిడీకి గురవుతున్నామనిర
పలువురు బాధితులులబోదిబోమంటున్నారు. వైద్యం
కోసం ప్రభుత్వాసుపత్రిలోనూ, ఆశ్రయించగా, అక్కడ
సరైన వసతులు లేక, వైద్యం అందకపోవడం వల్ల,
గ్రామాల్లో స్థానిక వైద్యులను చెపుతున్నారు. ఎటువంటి
అర్హత లేని, ఈ వైద్యులు, తమకు తోచిన వైద్యాన్ని
చేస్తూ, అందిన కాడికి దోచుకుంటున్నట్లు, ఆరోపణలు
వెల్లువెత్తుతున్నాయి. నిజానికి, గ్రామాల్లో ఆర్ఎంపీలు,
ప్రాథమిక చికిత్స అందించాల్సి ఉండగా, నిబంధన
లకు విరుద్ధంగా, ఆయా గ్రామాల్లో, గదులు, పడకలు,
ఏర్పాటు చేసి, ఇన్ పేషెంట్లుగా చేర్చుకొని, సెలైన్లు
ఇతర యాంటీబయాటిక్ లాంటి, డ్రగ్స్ అందిస్తు
న్నారు.
దీంతో, బాధితుల రోగం మరింత ముదిరి,
చివరి దశలో, నిర్మల్, నిజామాబాద్, పట్టణాలకు పరి
గెత్తుతున్నారు. ఇదివరకే స్థానికంగా, దోపిడీకి గురైన
బాధితులు, చేసేది లేక అప్పులు చేసి, ఇతర పట్టణా
లకు వైద్యం కోసం పరుగులు తీస్తున్నారు. దీనికి
కారణం, స్థానిక ఆర్ఎంపీ వైద్యులు అందరూ, ఒక
గ్రూపుగా ఏర్పడి, అంతటితో ఆగకుండా, వారి చేతి
కింద ఉన్న గ్రామాల ప్రజలపై, పెత్తనం చెలాయిస్తూ,
ఇప్పుడు వైద్యానికి వేరే చోటికి వెళ్తే, మళ్లీ ఎప్పుడైనా,
ఏమైనా అయితే ?ఎవరు చూస్తారు? అది చూద్దాం?
అని భయపెడుతున్నట్లు పుకార్లు ఉన్నాయి.
ఇదిలా
ఉండగా, కొంతమంది నేరుగా, మెడికల్ షాపులు ఆశ్ర
యించి, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ పై ఆధారపడుతు
న్నారు. ఇదే అదునుగా, మెడికల్ షాపులు రోగుల వద్ద
దండిగా దోచుకుంటున్నారు. రోగుల పరిస్థితి ఆర్థి
కంగా నష్టపోవడం తప్ప, చేసేదేమీ లేక, ప్రాణాలు
కాపాడుకోవడం కోసం, అటు, ఇటు, పరిగెత్తుతు
న్నారు. ఎక్కడికి వెళ్లినా, దారుణంగా దోచుకుంటు
న్నారే తప్ప, సరి అయిన వైద్యం దొరకడం లేదని,
వాపోతున్నారు
అరికట్టే అధికారులు కనుమరుగు…
.నిజానికి, ఇలాంటి దోపిడిని అరికట్టా
ల్సిన, వైద్యశాఖ అధికారులు, మెడికల్ షాపులను
అదుపులో పెట్టాల్సిన, డ్రగ్ ఇన్స్పెక్టర్ ల పర్యవేక్షణ
లేకపోవడం వల్ల, ఈ దారుణం జరుగుతుందని, ఆరో
పణలు ఉన్నాయి .
నిజానికి ఖానాపూర్ ప్రాంతంలో,
కోకొల్లలుగా మెడికల్ షాపులు వెలుస్తున్నప్పటికీ, ఏళ్ల
తరబడి, డ్రగ్ ఇన్స్పెక్టర్,ఇన్స్పెక్షన్ చేయడం లేదని,
ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి రాకుండా, ఇక్కడి
యూనియన్లు అడ్డుకొని, చేతులు తడుపుతున్నట్లు,
ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రజారో
గ్యమును పట్టించుకునే నాధుడే లేరని, పలువురు
వాపోతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఆసుప
త్రిలో, ప్రతిరోజు 500కు పైచిలుకు,జ్వర పీడితులు
చికిత్స కోసం రావడం, గమనార్హం ఇకనైనా శాకాధికా
రులు పట్టించుకుని ప్రజారోగ్యం కాపాడాలని వేడు
కుంటున్నారు.
[zombify_post]