డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
గత ప్రభుత్వం మాదిరి అధికార పార్టీ కండువా కప్పుకుంటేనే పెన్షన్ అనే విధంగా కాకుండా అర్హత ఉన్న అందరికీ పార్టీలకు అతీతంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను చిర్ల లబ్ధిదారులకు అందచేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 10 కోట్ల రూపాయలు పైనే ప్రతీ నెలా పెన్షన్ల రూపంలో లబ్ధిదారులకు అందచేస్తున్నామని,కొత్తగా ఆత్రేయపురం మండలంలో 464 నూతన పెన్షను మంజూరు కాగా మొదటి విడతలో 185, ఇప్పుడు 292,ఆలమూరు మండలంలో 581 నూతన పెన్షను మంజూరు కాగా మొదటి విడతలో 248, ఇప్పుడు 333రావులపాలెం మండలంలో 536 నూతన పెన్షను మంజూరు కాగా, మొదటి విడతలో 255, ఇప్పుడు 388, కొత్తపేట మండలంలో 543 నూతన పెన్షన్లు మంజూరు కాగా మొదటి విడతలో 241, ఇప్పుడు 302 పెన్షన్లు కలిపి మొత్తం 2234 మందికి పెన్షన్లు నూతనంగా అందచేస్తున్నామని, గత ప్రభుత్వంలో పెన్షన్లు ఎలా అందచేసేవారో ప్రజలకే తెలుసని పార్టీ కండువా కప్పుకోకపోతే కలెక్టర్ చెప్పినా పెన్షన్లు ఆపేసేవారని, ఇప్పుడు అలా కాకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా పెన్షన్లు అందిస్తున్నామని, గ్రామ వాలంటీర్లు ప్రతీనెలా 1 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు తెల్లవారకుండానే ఇంటికే వచ్చి పెన్షన్ అందిస్తున్నారని, వాలంటీర్ల సేవలను కొనియాడారు. గతంలో వృద్ధాప్య పెన్షన్ వయసు 65 సంవత్సరాలు ఉండగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 60 సంవత్సరాలకు తగ్గించారని అన్నారు. కార్యక్రమంలో ప్రజలు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
