విజయనగరం జిల్లా :అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనెల 30నుండి నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రజలందరికీ అవగాహణ కల్పించాలని మండల జిఎస్ డబ్ల్యుఎస్ ప్రత్యేక అధికారి, డ్వామా జిల్లా ప్రోజెక్టు డైరెక్టర్ కె.రామచంద్రరావు పిలుపు నిచ్చారు.బుదవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వైద్య సిబ్బందికి, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు.మండలంలోని 21గ్రామ సచివాలయంలలో రెండు టీముల ద్వారా ప్రత్యేక వైద్య నిపుణులు ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి తనిఖీలు, మందులు అందజేయడం జరుగుతుందన్నారు. ఎంపిడిఒ ఆద్వర్యంలో ఒక టీం,తహశీల్దార్ అధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాటశాల ఆవరణలో ఈవైద్యశిబిరాలు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. నెల రోజుల పాటు ఈకార్యక్రమం జరుగుతుందన్నారు.కార్యక్రమం గూర్చి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టరు జగన్మోహన్ రావు అన్నిఅంశాలను వివరించారు.మండలస్థాయి అధికారులు కూడా టీంలలో ఉండి పర్యవేక్షణ బాధ్యతలను చూస్తారని ఎంపిడిఓ ప్రసాద్, తహశీల్దార్ ఎన్వీ రమణలు తెలిపారు.ఈనెల 30నుండి అక్టోబర్ 31వరకు 21గ్రామ సచివాలయంల్లో నిర్వహించే వివరాలను వారు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపిడిఒ ప్రసాద్,తహశీల్దార్ ఎన్వీ రమణ, వైద్యులు శిరీష,ఉషారాణి, రాధాకాంత్ ,పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్ పీ లు ,హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]