వైఎస్ఆర్ బీమా పేదల ధీమా ఇస్తుందని సర్పంచి రేవళ్ల శ్రీనివాసరావు, ఎంపీటీసి సభ్యులు రెడ్డి సత్యనారాయణ అన్నారు. నెల్లిమర్ల మండలం సతివాడలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన సూర్యనారాయణ కుటుంబానికి రూ. 5లక్షలు చెక్కును సర్పంచి గురువారం అందజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదలకు వైసిపి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]