in , ,

రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి

  • జిల్లా సబ్ రిజిస్ట్రార్ ను సన్మానించిన పంతంగి

  • రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నపం.

  • రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి.

  • సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట టౌన్,సెప్టెంబర్13

సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా ఇటీవల విధులు చేపట్టిన సురేందర్ నాయక్ ను *సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్* ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో బుధవారం జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ కు విన్నవించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం  పరిపాలన సౌకర్యార్థం నూతన జిల్లాల ఏర్పాటుతో ఆయా జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా అభివృద్ధికి కోట్లాది రూపాయలు తెచ్చి అభివృద్ధి చేయడంతో సూర్యాపేట జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రభుత్వం ఎకరంలోపు ఉన్న భూములకు నాలా కన్వర్షన్ మీదనే రిజిస్ట్రేషన్ చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే జిల్లా కమిటీ పక్షాన సబ్ రిజిస్టర్ కు విన్నవించి పరిష్కరించే దిశగా తమ వంతు కృషి చేస్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, పట్టణ ఉపాధ్యక్షులు బానోత్ జానీ నాయక్, పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, సభ్యులు ఆకుల మారయ్య గౌడ్, అయితగాని మల్లయ్య గౌడ్, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, బొడ్డు   రామలింగయ్య యాదవ్, నంద్యాల యాదగిరిరెడ్డి, పల్లపు మీనయ్య, పురుషోత్తం, పెగ్గపురం నరసయ్య, ఆము నాయక్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి ఆదర్శం

మాపై అక్రమ కేసులు