in , , , ,

నారా లోకేష్ ను కలిసిన జనసేన నేతలు

*చంద్రబాబుకు సంపూర్ణ మద్ధతు

  •  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను జనసేన నేతలు కందుల దుర్గేష్, ప్రియా సౌజన్య, వేగుళ్ల లీలాకృష్ణ మంగళవారం రాజమహేంద్రవరంలో  పరామర్శించారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, దుర్మార్గపాలనపై కలసి పోరాడుదామని జనసేన నేతలన్నారు. చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని, రాష్ట్రంలో జగన్ అరాచకపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టును ఖండించిన వారిపైనా వైసీపీ నేతలు  విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ భూస్థాపితం అవుతుందన్నారు. టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కు మద్ధతు తెలిపి, బంద్ లో పాల్గొన్నందుకు జనసేన నేతలు, కార్యకర్తలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ ను కలిసిన వారిలో జనసేన నేతలు పితాని బాలకృష్ణ,  అత్తి సత్యనారాయణ, బత్తలు బలరామకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, చెరుకూరి రామారావు, తదితరులున్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Aruntez

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

పథకాల సొమ్ము ప్రజలది దళిత బిసి బందు పథకాలు అర్హులైన వాళ్లకు ఇవ్వాలి – అడ్లూరి

చదువుతోపాటు ఆటలలో కూడా రాణించలి