కేరళలో నిపా వైరస్ కలకలం
ఆరోగ్యశాఖ మంత్రి అత్యవసర సమావేశం
తిరువనంతపురం: దేశంలో మరోసారి నిపా వైరస్ కలకలం సృష్టించింది..

తాజాగా కేరళలో నిపా వైరస్ సోకి ఇద్దరు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, కేరళలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కారణంగా మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు.
వివరాల ప్రకారం.. కేరళలో మరోసారి నిపా వైరస్ ప్రబలుతోంది. నిపా వైరస్ సోకడంతో ఇన్‌ఫెక్షన్ కారణంగా కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేరళ హెల్త్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారని తెలిపారు..
[zombify_post]