న్యూస్, టుడే విశాఖపట్నం : శ్రీ జోసెఫ్ బేత ఆధ్వర్యంలో, మణిపూర్ ఘటనకి సంబంధించి వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ క్రాస్ రోడ్డు జంక్షన్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జోసెఫ్ బేత గారు మాట్లాడుతూ మణిపూర్లో ఘటనకి సంబంధించి బాధిత క్రిస్టియన్స్ మహిళలకి తగిన న్యాయం జరగాలి అని ఆయన తెలిపారు. రాజ్యంగా హక్కులని కాపాడాలి అని అయన తెలిపారు. అక్కడ క్రిస్టియన్స్ ని కాల్చి చంపుతున్నారు వారికీ, ప్రభుత్వం రక్షణ కలిపించాలని ఆయన అన్నారు. ఇది లౌకికవాద దేశం అని అన్ని మతాలని సమానం గా చూడాలి అని అయన అన్నారు. ఈ ర్యాలీ లో విశాఖపట్నం క్రైస్తవ సంఘాలు, ఫాదర్ లు, క్రైస్తవ మహిళలు, యువకులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.
[zombify_post]