-
మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తి…
-
రోడ్డు ప్రమాదం లో గాయపడిన హైకోర్టు న్యాయమూర్తి సుజాత ను మంత్రి జగదీష్ రెడ్డి కన్వాయ్ లో హైదరాబాద్ కు తరలింపు
-
చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రోడ్డు ప్రమాదం
-
అదుపుతప్పి పల్టీ కొట్టిన హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం
-
న్యాయమూర్తి సుజాత కు తీవ్ర గాయాలు
-
విషయం తెలుసుకుని హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రి కి వెళ్ళిన మంత్రి జగదీష్ రెడ్డి
-
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు
-
హైవే పొడవునా పోలీసులను అలెర్ట్ చేసిన మంత్రి
-
తన కాన్వాయ్ మధ్యలో అంబులెన్స్ ద్వారా న్యాయమూర్తి సుజాత ను హైదరాబాద్ కు తరలింపు
-
సూర్యాపేట:
సూర్యాపేట శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయమూర్తి ప్రాణాలను నిలబెట్టింది.
సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి రాత్రి 10 గంటల సమయం లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.. ప్రమాదంలో న్యాయ మూర్తి సుజాత తీవ్రంగా గాయపడింది. దీంతో పోలీసులు ప్రధమ చికిత్స కోసం ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రి కి తరలించారు. ఆ సమయం లో తిరుమలగిరి లో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఏరియా ఆసుపత్రి కి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడంతో , వెంటనే మూడు జిల్లా ల ఎస్పీల ని అలెర్ట్ చేసి, సూర్యాపేట నుండి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి పై ఉన్న పోలీసు స్టేషన్ సిబ్బంది ని ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఓ వైపు జోరు న వర్షం కురుస్తుండటం తో ఇబ్బందులు తలెత్తకుండా ఆమెను తరలించే అంబులెన్స్ ను తన కాన్వాయ్ మధ్య లో ఉంచి రక్షణగా హైదరాబాద్ కు తరలించారు.
మంత్రి గారి సమయస్పూర్తి తో కేవలం గంట పదిహేను నిమిషాలలో ఆమెను హైదరాబాద్ తరలించారు.. ప్రస్తుతం న్యాయ మూర్తి సుజాతకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. సకాలంలో ఆమెను హైదరాబాద్ తరలించడం మంచి పరిణామం అని వైద్యులు తెలిపారు.. న్యాయవాదిగా న్యాయమూర్తి సుజాతను సకాలంలో హైదరబాద్ కు తరలించిన మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తిని న్యాయవాదులు, ప్రజలు కొనియాడుతున్నారు.
[zombify_post]