సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
విజయనగరం ప్రభుత్వ వైద్యకళాశాలను ఈనెల 15న సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ, ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా హెలీప్యాడ్, సభాస్థలిని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్ ఉన్నారు.సీఎం పర్యటన విజయవంతం చేయాలని విజయనగరం వాసులకి పిలుపునిచ్చారు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే బాధ్యత సీఎం జగన్ దిఅంటూ చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలుపాల్గొన్నారు
[zombify_post]