.సంస్కృతి సంప్రదాయాలకు శ్రీకృష్ణ తత్వం ప్రతీక
వ్యక్తిత్వ వికాసానికి శ్రీ కృష్ణుడు ప్రతిరూపం
కృష్ణ తత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
సూర్యాపేట లోనీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వేడుకల్లో సందడి చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
ఉట్టితాడు లాగుతూ యువకులతో పోటీ పడిన మంత్రి
జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధర్మం వైపే నిలబడాలన్న శ్రీ కృష్ణతత్వాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, తద్వారా మెరుగైన సమాజ నిర్మాణానికి పాటు పడాలని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూచించారు. సూర్యాపేట లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణం లో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి ఉట్టి తాడు లాగుతూ యువకులతో పోటీ పడ్డారు. అనంతరం బూరెల స్థభం ఎక్కుతున్న యువకులను ఉత్సాహ పరిచారు. అనంతరం మాట్లాడుతూ
కృష్ణాష్టమి వంటి పర్వదినాలలో ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా యువకులకు
మెథోశక్తి, దైవ భక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. శ్రీ కృష్ణుని చరితమే ఒక మానవ జీవన అనుభవసారం అన్నారు .అలౌకిక ఆనందానికి, వ్యక్తిత్వ వికాసానికి శ్రీ కృష్ణుడు ప్రతిరూపమని అన్నారు.రాజనీతిజ్ఞుడిగా కృష్ణుడి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు శ్రీకృష్ణ తత్వం ప్రతీక అన్నారు.శ్రీ కృష్ణ తత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.నందగోపాలుడి చల్లని దీవెనలు, ఆశీర్వాదాలు అందరికీ కలగాలని కోరిన మంత్రి ,ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, నర్సయ్య యాదవ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, మోరిశేట్టి శ్రీనివాస్ , బత్తుల జానీ లక్ష్మీ యాదవ్, కడారి సతీష్ యాదవ్ బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ,మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
👏🏼
💐💐