అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.
బొండపల్లి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి ఎన్. దుర్గాప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. మండలంలో మిగిలి ఉన్న భవనాలను పూర్తి చేయడంతో పాటు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ తహసిల్దార్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]