నవ యుగ కవి వైతాళికుడు కాళోజీ
ప్రజాకవి జయంతిని ఘనంగా నిర్వహించాలి

కలెక్టర్, కమిషనర్, కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో హరిత హోటల్‌లో సమావేశం నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్
ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతిని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ , కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో హరిత హోటల్‌లో శుక్రవారం రోజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించాలని కోరారు. కాళోజీ చరిత్రను తెలిపేలా కార్యక్రమాలు రూపోందించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు. కాళోజీ చిత్రమాలికలతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. కాళోజీ నారాయణ రావు అవార్డు అందజేత కార్యక్రమాన్ని అన్ని హంగులతో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, విద్యార్థి, అశోక్, శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]