ఆర్టీసీ ప్రయాణం శ్రేయస్కారమంటూ ప్రకటనలు చేసే ఆర్టీసీ అధికారులు నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం, గంగవరం గ్రామాల మీదగా తిరిగే జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లో ప్రయాణికుల తో పాటు విద్యార్థులు తమ పాఠశాలలకు వెళ్లేందుకు ఎక్కుతుంటారు. ఈ బస్సు కి సైడ్ మిల్లర్స్ లేకపోవడంతో ప్రమాదకరంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థులను ఒకరిపై ఒకరిని కూర్చోబెట్టి రాకపోకలు సాగిస్తున్నారని, కండక్టర్ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బస్సు పై ప్రయాణం ప్రమాదకరంగా ఉందని కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
[zombify_post]