in , ,

ఎంపి రామ్మోహన్ నాయుడా.. మజాకా

ఎంపి రామ్మోహన్ నాయుడా.. మజాకా

*   ఎస్సీ అధికారుల నుంచి ఎంపి రాము అందిన వర్తమానం

* హాజరుకావాలని ఏపి చీఫ్ సెక్రటకబడిన తరగతుల
మిషన్ కార్యదర్శి ఆదేశాలు బీసీ సంఘాలకి తెలియజేయాలని వారికి సూచన

*సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనాన్ని తెలియజేసే డటా అందజేయాలని స్పష్టీకరణ

*జిల్లాకి చెందిన కళింగ కోమటి, శిష్టకరణ, పొండి. ఆర వారి తరపున బలమైన గొంతుకు వినిపించేందుకు ఎంపి

*సామాజిక, ఆర్థిక వెనుకబాటు

తనాన్ని తెలియజేసే డటా అందజేయాలని స్పష్టీకరణ

బిల్లులు, ఫోటో గ్రాఫ్స్, రికార్డులు

*రామ్మోహన్ నాయుడుకు సంఘాల నాయకులతో చర్చ

రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న బీసీ కులాలను ఓబీసీలో చేర్చేందుకు శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు శక్తి వంచన లకుండా తన వంతు కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఓబీసీ జాబితాలోకి ఆయా కులాలను తీసుకువెళ్ళేందుకు చొరవ తీసుకుంటునే ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ స్థాయిలో ఆయన ముమ్మర ప్రయత్నాలు నిరంతరం సాగిస్తునే ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కూడా లేఖల ద్వారా సంప్రదింపులు చేస్తునే ఉన్నారు. ప్రత్యేకించి జిల్లాలోని కళింగ కోమట్లు, శిష్టకరణాలు, అరవల, సాండి కులస్తులు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల జాబితాలో ఉన్నా కేంద్రంలోని ఓబీసీ జాబితాలో వారికి చోటు ఇంకా దక్కలేదు. జిల్లాలో ఎక్కువగా ఉండే. కళింగ కోమట్లు, శిష్టకరణాలు, అరవల, సాండి కులస్తులను ఓబీసీలో చేర్చేందుకు ఎంపి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.గతంలో తెదేపా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులను ఢిల్లీ తీసుకువెళ్లి ప్రధాని నరేంద్ర మోదీను కలవగా ఆయన సూచన మేరకు అప్పటి కేంద్ర మంత్రి, నేషనల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీస్) చైర్మన్ ను కలసి వారి గోడును వినిపించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎంపి కేంద్ర స్థాయిలో తన ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. జిల్లాలోని కళింగ కోమట్లకి, శిష్ట కరణాలు, అరవల, సాండి కులస్తులకి వారి అసోసియేషన్ల ప్రతినిధులక్ ఇచ్చిన హామీ మేరకు రామ్మోహన్ నాయుడు ముందుకు సాగుతున్నారు. ఎన్ సీబీని అధికారులతో సంప్రదింపులు చేస్తునే ఉన్నారు. ఆ క్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి కూడా ఇటీవల ఎంపి రాము లేఖ రాసారు. రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల పరిస్థితులను నివేదిక రూపంలో ఎన్సీబీసికి పంపించాలని కూడా దానిలో కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర అధికారులు ఎన్సిబిసికి సమాచారం అందజేయగా ఆ విషయాన్ని ఎంపి రామ్మోహన్ నాయుడుకి కూడా వారు తెలియజేసారు. దీంతో ఎంపి రామ్మోహన్ నాయుడు ఎన్సీబీసి వర్గాలతో సంప్రదింపులు జరిపి ఓబీసీ జాబితాలో శ్రీకాకుళం జిల్లాకి చెందిన శిష్టకరణ, కళింగకోమట్లు, కులస్తులను చేర్చే చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. ఎంపి రాము | తీసుకున్న చొరవతో నేషనల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ చైర్మన్ ఈ నెల 13న ఢిల్లీలోని కస్తూర్భా గాంధీ మార్గ్ లోని న్యూ మహారాష్ట్ర సదసీ సమావేశ మందిరంలో హియరింగ్ నిర్వహించనున్నారు. ఎన్సీబీసి నిర్వహించే హియరింగ్ పేర్కొంటున్నారు.

హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఏపి వెనుకబడిన తరగతుల కమిషన్: కార్యాదర్శి లకి సమన్లు జారీ చేసారు. ఇదే సందర్భంగా కళింగ కోమటి, శిష్టకరణ, అరవల, సాండి సామాజిక వర్గాల ప్రతినిధులకి సమాచారం ఇవ్వాలని కూడా లేఖలో పేర్కొన్నారు. ఇదే సందర్భంలో మొదట నుంచి ఎన్సీబీసి అధికారులతో సంప్రదింపులు చేస్తున్న శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడుకి కూడా ఈ హియరింగ్ సమాచారం తెలియజేసి హాజరుకావాలని వర్తమానం అందజేసారు. అంతేకాకుండా ఆయా వెనుకబడిన కులాల ఆర్ధిక, సామాజిక వెనుకబాటుతనాన్ని తెలియజేసేలా వ్రాతపూర్వక వినతులు,డాక్యుమెంట్లు, సాక్ష్యాలు, ఆడియో విజువల్స్ ఫోటోగ్రాఫ్స్ రికార్డులు, డేటాను ఈ నెల 8వ తేదిలోగా ఆరు సెట్లను ఇంగ్లీషు, హిందీలలో అందజేయాల్సిందిగా కూడా ఆ లేఖలో స్పష్టం చేసారు. అలాగే అనెక్టర్ – 1లో వెరిఫికేషన్ అఫిడవిట్ ను సబ్ మిట్ చేయాలని కూడా తెలియజేసారు. రాతపూర్వక వినతులన్నింటిని కూడా ఎన్.సి బిసి సెక్రటరీ పేరు మీద అందజేయాలని సూచించారు. ఎన్నిబిసి హియరింగ్: తేదీని ఈ నెల 13గా ఇవ్వడంతో ఎంపి రామ్మోహన్ నాయుడు ఆ సమాచారాన్ని జిల్లాలోని శిష్టకరణ, కళింగ కోమటి, అరవల, సాండ్ కులాల ప్రతినిధులకి, తెలియజేసారు. వాదనలను వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా వారికి స్పష్టమైన సూచనలు చేసారు. అలాగే శిష్టకరణ, కళింగ కోమటి, అరవల, సొండి. కులాలను కలిసి జాబితాలో చేర్చేందుకు గట్టిగా తన గొంతును వినిపించాలని రామ్మోహన్ నాయుడు సిద్ధమయ్యారు. అందుకు అవసరమైన విషయాలను కూడా ఆయన సేకరిస్తున్నారు. శిష్టకరణ, కళింగ కోమటి, అరవల, సాండి కులాల ప్రతినిధులతో కింజరావు కుటుంబానికి మొదట నుంచి సత్ససంబంధాలు: ఉన్నాయి. ఈ క్రమంలో ఆ నాలుగు సామాజిక వర్గాలను ఓబీసీ జాబితో చేర్చే. బాధ్యత తనదని ఆయన వారికి ఇది వరకే భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఎంపి రామ్మోహన్ నాయుడు వారి పక్షాన నిత్యం కృషి చేస్తునే ఉన్నారు. వెనుకబడిన ఆయా కులాలను ఓబీసి జాబితో చేర్చే అంశం చివరికి అంకానికి చేరుకున్న దృష్ట్యా మరింతగా వారి కోసం పోరాడి దానిని ఎలాగైనా సాధించాలన్న అరవల, సాండి కృతనిశ్చయంతో ఎంపి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఎంపి రామ్మోహన్ నాయుడు తీసుకుంటున్న చొరవ పట్ల ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓబీసీలో తమ కులాలకి చోటు దక్కితే ఎంపి రామ్మోహన్ నాయుడుకి తమ సామాజిక వర్గాం రుణపడి ఉంటుంది

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

*చిరు వ్యాపారుల‌కు గొడుగులు పంపిణీ చేసిన మంత్రి ఐకె రెడ్డి*

గర్భిణీలు, బాలింతలకు సౌకర్యవంతమైన సేవలు అందించటమే లక్ష్యం