శ్రీ కృష్ణుని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని, ఆయన చెప్పిన జీవిత సత్యాలను అందరూ అర్ధం చేసుకుంటే జీవితంలో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనే శక్తి వస్తుందని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, నందిగాం మండలం కవిటి అగ్రహారం గ్రామంలో బుధవారం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న యాదవ ప్రముఖులను సత్కరించారు. అనంతరం వెయిట్ లిఫ్టింగ్, సంగిడి రాళ్ల పోటీ, ఉలవలు బస్తా పోటీలో గెలిచిన మొదటి స్థానం వారికి రూ.5 వేలు, రెండవ స్థానం వారికి రూ.3 వేలు, మూడవ స్థానం వారికి రూ.2 వేలు నగదు బహుమతులను అందించారు. ఇప్పటికీ ప్రాచీన కళలను, క్రీడలను ప్రోత్సహిస్తున్న యువతకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.
ఉట్టి కొట్టి ఉత్తేజపరిచిన ఎంపీ : పోటీల అనంతరం, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జోరు వాన లో సైతం రామ్మోహన్ నాయుడు ఉట్టి కొడుతున్నప్పుడు ఈలలతో, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది..
[zombify_post]