ఉరేసుకుని వివాహిత ఆత్మహత్
కురుపాం మండలం పూతికవలస గ్రామంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేసినట్టు సిఐ సత్యనారాయణ తెలిపారు. భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు కలగడం వలనే ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ఎస్సీ కాలనీకి చెందిన మండంగి దుర్గాప్రసాదరావు, పోలాకి మండలానికి చెందిన ఎం. సంధ్య (24)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడని ఇద్దరి మధ్య గొడవల కారణంగా సంధ్య ఇంట్లో ఉరి వేసుకుందని అన్నారు. బుధవారం కేసు నమోదు చేశామన్నారు.
[zombify_post]