జంక్షన్ల అభివృద్ధికై ప్రభుత్వం కృషి…
ఈనెల తొమ్మిదవ తేదీన హనుమకొండ కు కేటీఆర్ రాక
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ పశ్చిమ పరిధిలోని పలు జంక్షన్ లను పరిశీలించారు అనంతరం రాత్రి వేళలో రోడ్లపై నిద్రించే వారి కొరకు పునరావస కేంద్రాలను నిర్మించుట కొరకు స్థల పరిశీలన చేసిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఈ సందర్భంగా చీఫ్ విప్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చారిత్రక నగరంలో పట్టణాన్ని,నగరాన్ని సుందరీకరణ చేయడానికి వెడల్పైన రోడ్డు, పచ్చదనం పరిశుభ్రత ఉట్టిపడేలా ఉద్యానవనాలు ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కొక్క జంక్షన్ లో ఒక్కొక్క థీమ్ తో జంక్షన్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మూడు కోట్ల రూపాయలు తో 19 జంక్షన్ లను అభివృద్ధి పరచడానికి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక వర్గాలకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించడానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో, కెసిఆర్ నాయకత్వంలో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. 9వ తారీకు రోజున ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని, ఇంకా 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, 9వ తేదీ లోపు అన్ని కార్యక్రమాలు పూర్తయితయనే ధీమా వ్యక్తం చేశారు. 9వ తేదీన ఐటీ పురపాలక పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని తెలిపారు. కాళోజి కళా క్షేత్రంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నానరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఓ ఎస్ డి కృష్ణ ,కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్,మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మునిసిపల్ డిఈ సంతోష్,ఈఈ రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు..
[zombify_post]