in ,

జోరుగా సీతాఫలాలు వ్యాపారం

పాడేరు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా:  పాడేరు మండలంలోని వంట్లమామిడి జంక్షన్‌లో సీతాఫలాల వ్యాపారం భారీగా జరిగింది. జి.మాడుగుల, పాడేరు మండలాలకు చెందిన గిరిజన రైతులంతా పెద్ద మొత్తంలో బుట్టలతో సీతాఫలాలను తీసుకువచ్చారు.వ్యాపారులంతా పోటీపడి కొనుగోలు చేశారు. బుట్ట పండ్లను రూ.400నుంచి రూ.500 ధరకు విక్రయించినట్టు గిరి రైతులు తెలిపారు. కోల్‌కతా, విజయవాడ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సీతాఫలాలను ప్యాకింగ్‌ చేసి వ్యాన్లలో తరలించారు. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, పర్యాటకులు కూడా కొనుగోలు చేయడంతో వ్యాపారం భారీగా జరిగింది. ఉదయం 10 గంటలకు వరకు జంక్షన్‌ రద్దీగా మారింది.

[zombify_post]

Report

What do you think?

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సందర్భంగా

జాతీయస్థాయిలో కుంగ్ ఫు పోటీలలో పథకాలు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులు