▪️ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయోగం ఉదయం 11.50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
▪️శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ-57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టారు.
▪️రూ. 378 కోట్లతో ప్రయోగించిన ఈ మిషన్.. నాలుగు నెలలపాటు ప్రయాణించి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్ (ఎల్ 1) వద్దకు చేరుకోనుంది.
రాకెట్ వివరాలు
▪️పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు.
▪️రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01-03-31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది.
▪️మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్ అలోన్ దశ, ఈ ప్రయోగానికి రాకెట్ చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు.
▪️212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది.
▪️41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది.
▪️7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు.
▪️మళ్లీ నాలుగోదశ (పీఎస్-4) 3127.52 సెకన్లకు స్టార్ట్ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్ చేస్తారు.
▪️శిఖరభాగాన అమర్చిన ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు-1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు.