పొనుగుటివలస గ్రామంలో డ్వాక్రా నిధులు స్వాహా అయినట్టు వస్తున్న అభియోగంపై మెప్మా పీడీ సుధాకర్ శుక్రవారం ఆ గ్రామంలో విచారణ చేయించారు
.రాజాం: పొనుగుటివలస గ్రామంలో డ్వాక్రా నిధులు స్వాహా అయినట్టు వస్తున్న అభియోగంపై మెప్మా పీడీ సుధాకర్ శుక్రవారం ఆ గ్రామంలో విచారణ చేయించారు. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మెప్మా అధికారులను, సిబ్బందిని 37 మందిని పంపించి విచారణ చేపట్టారు. సీఆర్పీల ద్వారా అందిన సమాచారం మేరకు 78 డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. అధికారులు విచారణ అనంతరం నివేదికలను మెప్మా టీఎంసీ రత్నంకు అందించారు. అయితే 78 గ్రూపులకు సంబంధించి ఏ గ్రూపులో ఎంతనిఽ దులు స్వాహా అయ్యాయో నివేదికలు తయారు చేయడంతో పాటు ఆయా బ్యాంకు లకు వెళ్లి పూర్తిస్థాయిలో నిర్ధారణ చేస్తామని రత్నం తెలిపారు. ఈ నివేదికలను మెప్మా పీడీకి అందించి, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పా రు. పూర్తి వివరాలు శనివారం వెల్లడిస్తామని చెప్పారు.
This post was created with our nice and easy submission form. Create your post!