పాడేరు అక్టోబరు 4 : నీతి ఆయోగ్ యాస్పిరేషన్ బ్లాక్ ఫెలో ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం వెల్లడించారు. సెప్టెంబరు 30 తేదీన రాత పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 7 వ తేదీన రంపచోడవరం ఐటిడి ఏ కార్యాలయంలో లో మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలియ జేసారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్దుల జాబితాను జిల్లా కలెక్టర్ అధికారిక వెబ్సైట్లోను పొందుపర్చామని అన్నారు. సిపి ఓ కార్యాలయం నోటీస్ బోర్డులో జాబితాను ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్దులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!