పి గన్నవరం మండలం పోతవరానికి చెందిన చిట్టూరి నాగమణి (35) కాళ్ళ నరాలు ఇబ్బంది పెడుతున్నాయని అమలాపురం శ్రీనిధి ఆసుపత్రి లో గురువారం చేర్చారు. ఆమె కాళ్లకు ఆపరేషన్ చేసి సోమవారం ఢీఛార్జ్ చేశారు. అయితే ఆమె ఈరోజు ఉదయం ఇంటి వద్ద ప్రాణాలు వదిలేసింది. దాంతో బందువులు ఆమె మృతదేహాన్ని తీసుకుని శ్రీనిధి ఆసుపత్రి కి చేరుకొని అందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయలని డిమాండ్ చేశారు. 35 సంవత్సరాల వయసు గల ఆమెకు నరాలు ఆపరేషన్ సరిగ్గా చేయకుండా చంపేశారని ఆరోపిస్తున్నారు. అయితే డాక్టర్లు తమకు పిచ్చా అంటూ దూషించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనిధి ఆసుపత్రి పై ఇప్పటికే పలు ఆరోపణలు వున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయాలి అని ఆసుపత్రి యాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!