గౌరవనీయులైన గుంతకల్ రెవిన్యూ డివిజన్ అధికారి (RDO) గారికి ,
సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ సమర్పించు మెమోరాండం ,
విషయం ,, ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా స్వాధీనం చేసుకొనుట కొరకు .
పట్టణంలో బళ్లారి సర్కిల్ , హెచ్ పి పెట్రోల్ బంక్ ప్రక్కన గుంతకల్ గ్రామ పొలం సర్వే నంబర్ 424 –బి లోని 23 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని పెట్రోల్ బంక్ యజమాని దేవేంద్రప్ప ఆక్రమించి 16 షెడ్లను అక్రమంగా నిర్మించుచున్నారు .
కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా వెంటనే స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలి, గతంలో కూడా పై సర్వే నంబర్ స్థలాన్ని ఆర్ టి ఓ కార్యాలయానికి కేటాయించడం జరిగినది. విస్తీర్ణం తక్కువగా ఉన్నదని అక్కడ ఆర్ టి ఓ కార్యాలయాన్ని నిర్మించడానికి వీలు కాదని అధికారులు అప్పట్లో భవనాన్ని నిర్మించలేదు . దీనినే అదునుగా తీసుకొని ప్రైవేటు వ్యక్తులు విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుచున్నారు . ఇంత జరుగుతున్న రెవెన్యూ , మున్సిపల్ , ఆర్ అండ్ బి అధికారులు స్పందించకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతూ కబ్జా చేస్తున్న వ్యక్తులకు తమ సహకారాన్ని అందించడం జరుగుతున్నది .
కావున దయచేసి ఈ విషయం మీద తమరు వెంటనే స్పందించి పై సర్వేనెంబర్ సంబంధించిన స్థలాం పై విచారణ జరిపి , ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము . లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ప్రభుత్వానికి తెలుపుతున్నాము .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుంతకల్ డివిజన్ కార్యదర్శి బి , సురేష్ , పట్టణ కార్యదర్శి చిన్నా , ఐ ఎఫ్ టి యు పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు , కమిటీ సభ్యులు భాష , నారాయణ , జానయ్య , గోపి , కృష్ణ రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు .
This post was created with our nice and easy submission form. Create your post!