*విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన కోర్సు ఫీజులను తిరిగి ఇవ్వాలి.
*డిప్యూటేషన్ పూర్తయినా, వర్సిటీలోనే వర్సిటీలోనే పాతుకపోయిన రిజిస్టర్ శ్రీనివాసులను తొలగించాలి.*
* ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ ముందు ధర్నా.*

కర్నూలు నగరంలో ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఫర్ మెన్), సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల, కె.వి.ఆర్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే జగనన్న విద్యా దీవెన కాకుండా, విద్యా దీవెన పథకానికి తూట్లు పొడుస్తూ కోర్సు ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన వేలాది రూపాయలను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని, డిప్యూటేషన్ పూర్తి అయ్యి,వర్శిటీ లొనే పాతుకుపోయిన రిజిస్టర్ శ్రీనివాసులును తొలగించాలి డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ముందు బైఠాయించి, ధర్నా నిర్వహించి, అనంతరం వీసీ స్పందించకపోవడంతో వీసీ ఛాంబర్ నందు నిరసన తెలపడం జరిగింది. దీంతో వీసీ సాయి గోపాల్ గారు దిగివచ్చి, అక్రమ వసూళ్లను తిరిగి ఇచ్చేలా ప్రిన్సిపాల్ ను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.సోమన్న, ఎస్.షాబీర్ బాషా, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్, నగర కార్యదర్శి మునిస్వామి, నాయకులు అశోక్,కళ్యాణ్, శివ, కళాశాల విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!