పత్రిక ప్రకటన
*
*వాలంటీర్లు తప్పనిసరిగా సేవలందించాలి*
*తహసిల్దార్, ఎంపిడిఓలదే కీలక పాత్ర*
పాడేరు, అక్టోబర్ 25:- అక్టోబర్ ఒకటవ తేదీ నుండి 45 రోజుల పాటు నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిభిరాలు ప్రణాలికా బద్దంగా, ఫక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం కల్లెక్తరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఆరోగ్య ఆంద్ర ప్రదేశ్ దిశగా ప్రతి వ్యక్తీ ఆరోగ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఇంటింటి సర్వే జరుగుతోందని, తద్వారా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా బిపి, షుగర్, పరీక్షలు నిర్వహించి తగు మందులు అందజేయాలన్నారు. అదే విధంగా క్రానిక్ వ్యాదులైన కేన్సర్, గుండె పోతూ, కిడ్నీ సమస్యలు లాంటివి గుర్తించి ఆయా మండలాలలో నిర్వహించే వైద్య శిభిరాలకు తరలించి స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించాలని, అవసరమైతే ఉన్నత ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. అందుకు అవసరమయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసారు. ఇందులో తహసిల్దార్లు, ఎంపిడిఓలు కీలక పాత్ర వహించాలని సూచించారు.
ఇంటింటి సర్వేలో వాలంటీర్లు పాల్గొనటం లేదని తన దృష్టికి వచ్చిందని, వాలంటీర్లు తప్పనిసరిగా పాల్గొనే విధంగా తగు ఆదేశాలు జారీ చేయాలని ఎంపిడిఒలను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మన జిల్లాలో రక్త హీనతతో భాద పడేవారు, పౌష్టికాహార లోపంతో భాద పడేవారు, ఎక్కువగా ఉన్నారని వారిని గుర్తించి వైద్య శిభిరాలకు తరలించి చికిత్స అందించాలని కోరారు. ఇంటింటి సర్వే రెండు బృందాలుగా నిర్వహించాలని, ప్రతి ఇంటినీ తప్పని సరిగా కవర్ చేయాలని సూచించారు. అదేవిధంగా వైద్య శిభిరాల నిర్వహణకు తగు స్థలం సమయం గుర్తించి రెండు, మూడు రోజుల ముందుగా ఆయా గ్రామాలలో విస్తృత ప్రచారం గావించాలని ఆదేశించారు.
ముఖ్యంగా జగనన్న ఆరోగ్య శిభిరం కేవలం వైద్య శాఖకు చెందినదిగా భావించవద్దని, ఇందులో స్త్రీ, శిశు సంక్షేమం, విద్యా శాఖలు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ఎటువంటి గ్యాప్ లను సాహిoచబోనని హెచ్చరించారు. అంగన్వాడి కేంద్రాలలో, పాటశాలలలో బరువు తక్కువ, రక్త హీనత, ఎదుగుదల లోపం గల పిల్లలను గుర్తించి వారిని కూడా వైద్య శిభిరాలకు తరలించి చికిత్సలు అందించాలన్నారు. ప్రతి మండలానికి కనీసం ఇద్దరు ప్రత్యెక వైద్య నిపుణులు విధులు నిర్వహిస్తారని, వారి ఫోన్ నంబర్లను ఆరోగ్య కేంద్రాల వైధ్యాదికారులకు షేర్ చేయాలని డిఎoహెచ్ఓ కు ఆదేశించారు. జిల్లా లో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలన్నారు.
*దిగువ మాదాపుట్టులో నేడు పైలట్ ప్రోగ్రాం:* జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ ఒకటి నుండి 45 రోజుల పాటు 290 జగనన్న ఆరోగ్య సురక్ష ప్రత్యెక వైద్య శిభిరాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. నేడు (మంగళవారం) దిగువ మాదాపుట్టు లో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రత్యెక వైద్య శిభిరాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్వహిస్తామని, తద్వారా లోపాలు, లోటు పాటులు తెలుసుకుని వాటిని అధిగమించటానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జమాల్ బాష, రాష్ట్ర నోడల్ అధికారి డా. రమేష్ బాబు, డిసిహెచ్ఎస్ డా. కృష్ణా రావు, టి.బి నియంత్రణాదికారి డా. విశ్వేశ్వర నాయుడు, మండలాల నుండి తహసిల్దార్లు, ఎంపిడిఓలు, వైధ్యాదికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!