అనకాపల్లి జిల్లా గొలుగొండ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల /కళాశాల విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచారని ప్రిన్సిపాల్ రుత్తల రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆటల పోటీలలో గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచిన వారిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ 19 కబడ్డీలో నందకిషోర్, త్రో బాల్ లో వెంకట శివ, సిద్దు ,వెయిట్ లిఫ్టింగ్ నుండి కుమారస్వామి జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయ్యారని మరియు అండర్-14 నుండి ఠాగూర్, శ్యాం కుమార్ టెన్నికాయిట్ లో జిల్లా స్థాయికి ఎంపికయ్యారని, అలాగే అండర్ 17 విభాగం నుండి పురుషేశ్వర్, సంతోష్ మరియు నాగరాజు వాలీబాల్ జిల్లా స్థాయికి సెలెక్ట్ అయ్యారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కెవి రమణ, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!