స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును 2 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు విచారణ జరపాలని వెల్లడించింది. సీఐడీ 5 రోజుల పాటు కస్టడీకి అడగగా..2 రోజులు మాత్రమే అనుమతించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది.
చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

